![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. ప్రేమ బ్యాచిలర్ పార్టీ కోసం ఏం డ్రెస్ వేసుకోవాలో ఆలోచిస్తుంటే.. నర్మద వేదవతి వచ్చి డ్రెస్ సెలక్ట్ చెయ్యడం హెల్ప్ చేస్తానని అంటారు. ప్రేమ వెస్టన్ వేసుకుంటే వేదవతి వద్దని అంటుంది. లంగావోణి వేదవతి సెలక్ట్ చేస్తుంది.
ఆ తర్వాత ప్రేమ లంగావోణి వేసుకొని వస్తుంది. ప్రేమని ఆ డ్రెస్ లో చూసి ధీరజ్ షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు.. నేను ఎలా ఉన్నానని ప్రేమ అనగానే బాగున్నావని ధీరజ్ అంటాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అదంతా నర్మద చూసి మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. ఆ తర్వాత అసలు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందని నర్మద ఆలోచనలో పడుతుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తారు. అందరు అక్కడ ధీరజ్ ని ఆటపట్టిస్తారు.
ఐశ్వర్య వచ్చిందని ధీరజ్ ఫ్రెండ్స్ తనకి చెప్తారు. ఐశ్వర్య వచ్చి ధీరజ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ప్రేమ కోపంగా.. ధీరజ్ చెయ్ పట్టుకుంటుంది. ఎవరు ఆవిడా అని ఐశ్వర్య అనగానే.. నా భార్య అని ధీరజ్ చెప్తాడు. అయిన వినకుండా ధీరజ్ కి దగ్గరగా ఉంటే ప్రేమ కోపంగా దూరంగా వస్తుంది. మరొకవైపు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందో కనుక్కోడానికి తిరుపతి హెల్ప్ తీసుకుంటుంది నర్మద. తరువాయి భాగంలో ధీరజ్ తో ప్రేమ డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |